ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ సంచలన రికార్డు.. మొట్టమొదటి భారతీయ క్రికెటర్‌గా అవతరణ

  • ఐపీఎల్‌లో ఎదుర్కొన్న తొలి 3 బంతులను సిక్సర్లుగా బాదిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచిన ధోనీ
  • మొత్తంగా మూడవ ఆటగాడిగా ధోనీ రికార్డు
  • ముంబై ఇండియన్స్‌పై పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన చెన్నై మాజీ కెప్టెన్
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ ఎంఎస్ ధోనీ చెలరేగాడు. ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తాను ఎదుర్కొన్న 4 బంతుల్లో 20 పరుగులు బాదాడు. వరుస సిక్సర్లతో వాంఖడే స్టేడియాన్ని మోతెక్కించాడు. అదిరిపోయ రేంజ్‌లో ఇన్నింగ్స్‌ని ముగించిన ధోనీ చెన్నై స్కోరు 200 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ధోనీ సంచలన రికార్డును సృష్టించాడు.

ఐపీఎల్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఇదివరకు భారతీయ ఆటగాళ్లు ఎవరూ ఈ ఫీట్‌ను సాధించలేకపోయారు. ఇక ఐపీఎల్ మొత్తం మీద ఈ రికార్డు సాధించిన మూడవ క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. 

ఐపీఎల్‌లో తొలి మూడు బంతులను సిక్సర్లు బాదింది వీళ్లే..
1. సునీల్ నరైన్ (2021లో ఆర్సీబీపై కేకేఆర్ మ్యాచ్‌ 12వ ఓవర్‌లో)
2. నికోలస్ పూరన్ (2023లో సన్‌రైజర్స్‌పై లక్నో మ్యాచ్‌ 16వ ఓవర్‌లో)
3. ఎంఎస్ ధోనీ (2024లో ముంబైపై సీఎస్కే మ్యాచ్ 20వ ఓవర్‌లో)

కాగా ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపులో చివరిలో ధోనీ బాదిన 3 సిక్సర్లు బాగా కలిసొచ్చాయి. ఇక హార్ధిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్‌లో లాంగ్-ఆఫ్‌, లాంగ్-ఆన్‌, స్క్వేర్ లెగ్‌పై ధోనీ కొట్టిన సిక్సర్లతో స్టేడియం మోతెక్కిపోయింది. ధోనీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


More Telugu News