రాత్రి బాగా నిద్రపట్టడానికి కర్ణాటక మహిళా మంత్రికి బీజేపీ నేత సలహా.. విమర్శలు
- ఓ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్
- బీజేపీకి మహిళల ఆదరణ పెరుగుతుండడంతో మంత్రి లక్ష్మికి నిద్ర పట్టడం లేదని విమర్శ
- బాగా నిద్రపట్టాలంటే స్లీపింగ్ పిల్ కానీ, ఎక్స్‌ట్రా పెగ్ కానీ వేసుకోవాలని సలహా
- మహిళలపై బీజేపీకి ఉన్న గౌరవం ఇదేనన్న కాంగ్రెస్
కర్ణాటక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతుండడంతో కాంగ్రెస్ నేత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌కు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. ఆమెకు నిద్ర పట్టాలంటే స్లీపింగ్ పిల్స్ కానీ, ఎక్స్‌ట్రా పెగ్ కానీ వేసుకోవాలని సూచించడం వివాదాస్పదమైంది.
సంజయ్ పాటిల్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని 8 వేర్వేరు ప్రాంతాలకు తాను ఇన్‌చార్జ్‌గా పనిచేశానని, బెలగావిలో బీజేపీకి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. కాబట్టి నా పెద్ద సోదరి (లక్ష్మీ హెబ్బాల్కర్)కి రాత్రుళ్లు బాగా నిద్రపట్టాలంటే స్లీపింగ్ పిల్ కానీ, ఒక ఎక్స్‌ట్రా పెగ్ కానీ వేసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. అక్కడ రమేశ్ జార్కిహోళి ప్రచారం చేయడం కూడా ఆమెకు ఇబ్బందిగా ఉందని బెలగావిలో ఓ సమావేశంలో పేర్కొన్నారు.
పాటిల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సంజయ్ పాటిల్ తన వ్యాఖ్యలతో మొత్తం మహిళలనే అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌరవులు, రావణుడిలా బీజేపీలో మహిళా వ్యతిరేక వైఖరి పెరిగిపోతోందని ఆరోపించారు. బీజేపీ, జేడీఎస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించింది.