టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారతీయ క్రికెటర్‌గా అవతరణ

  • టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన హిట్‌మ్యాన్
  • ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రోహిత్
  • అంతర్జాతీయ క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన టీమిండియా కెప్టెన్
టీమిండియా కెప్టెన్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్... టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న ఏకైక భారతీయ క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఇక అత్యధిక సిక్సర్లు బాదిన అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లు

1. రోహిత్ శర్మ - 502 - (419 మ్యాచ్‌లు)
2. విరాట్ కోహ్లీ - 383 - (365 మ్యాచ్‌లు)
3. ఎంఎస్ ధోనీ - 328 - (334 మ్యాచ్‌లు)
4. సురేష్ రైనా - 325 - (319 మ్యాచ్‌లు)
5. కేఎల్ రాహుల్ 300 - (205 మ్యాచ్‌లు)

టాప్ అంతర్జాతీయ ఆటగాళ్లు..

1. క్రిస్ గేల్ - 1056 (455 మ్యాచ్‌లు)
2. కీరన్ పొలార్డ్ - 860  (586 మ్యాచ్‌లు)
3. ఆండ్య్రూ రస్సెల్ - 678 (420 మ్యాచ్‌లు)
4. కోలిన్ మున్రో - 548 (409 మ్యాచ్‌లు)
5. రోహిత్ శర్మ - 501 (419 మ్యాచ్‌లు)

మరోవైపు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ అవతరించాడు. గత రాత్రి మ్యాచ్‌లో తొలి 5 పరుగులు చేసిన తర్వాత సురేశ్ రైనాను అధిగమించి హిట్‌మ్యాన్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ప్రస్తుతం 837 పరుగులతో రోహిత్ శర్మ టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లగా సురేశ్ రైనా 2వ స్థానానికి దిగజారాడు.

ముంబై, చెన్నై మధ్య అత్యధిక పరుగులు బాదిన ఆటగాళ్లు

1. రోహిత్ శర్మ - 837 (ముంబై - 29 మ్యాచ్‌లు)
2. సురేష్ రైనా - 736 (చెన్నై - 32 మ్యాచ్‌లు)
3. ఎంఎస్ ధోనీ - 732 (సీఎస్కే- 33 మ్యాచ్‌లు)
4. అంబటి రాయుడు - 664 ముంబై, సీఎస్కే - 33 మ్యాచ్‌లు)
5. కీరన్ పొలార్డ్ - 636 (ముంబై - 25 మ్యాచ్‌లు).

కాగా గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. చెన్నై నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో రోహిత్ శర్మ సెంచరీ వృథా అయింది. ఇక చెన్నై గెలుపులో ఆ జట్టు స్టార్ బౌలర్ మతీశ పతిరన (4/28) కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే రాణించారు.


More Telugu News