చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైసీపీ
- నిన్న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి
- ఈసీ చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు
- ఇవాళ గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతుకుడు
- ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలన్న వైసీపీ
ఏపీ సీఎం జగన్ పై నిన్న విజయవాడలో రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఇవాళ గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
"చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకులను శిక్షించాలని కోరుతున్నాం" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది.