జగన్ అంబులెన్స్ ద్వారా చికిత్స పొందకుండా, తన బస్సులోకి ఎందుకు వెళ్లినట్టు?: పట్టాభి
- గత రాత్రి విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
- టీడీపీ పనే అంటూ వైసీపీ ఆరోపణలు
- ఓటమి భయంతో డ్రామాలు ఆడుతున్నారంటూ టీడీపీ నేత పట్టాభి విమర్శలు
- సానుభూతి కోసం దాడి చేయించుకున్నారని వెల్లడి
సీఎం జగన్ పై రాయితో దాడి టీడీపీ పనే అని వైసీపీ ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రజలు ఛీ కొడుతుండడంతో, ఓటమి భయం వల్లే ఈ డ్రామా ఆడారని స్పష్టం చేశారు. సీఎం కాన్వాయ్ లో అంబులెన్స్ కూడా ఉందని, అలాంటప్పుడు గాయమైతే అంబులెన్స్ ద్వారా చికిత్స పొందకుండా, సీఎం జగన్ తన బస్సులోకి ఎందుకు వెళ్లినట్టు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో సానుభూతి కోసం దాడి చేయించుకుని, టీడీపీపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోడికత్తి డ్రామా తరహాలో సానుభూతి కోసం ప్రయత్నించారని విమర్శించారు. ఇందులో జగన్ హీరో, వెల్లంపల్లి సైడ్ హీరో... తమ పాత్రలను వారు రసవత్తరంగా పోషించారని పట్టాభి ఎద్దేవా చేశారు. ఈ డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్ లో స్క్రిప్ట్ తయారైందని అన్నారు.