ఇప్పుడే అమాయక దళితుడు బలవుతాడో.. రాయిదాడి ఘటనపై నక్కా ఆనంద్‌బాబు ఆవేదన

  • గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాకు ఓ దళితుడు ఐదేళ్లు జైలులో ఉన్నాడన్న ఆనందబాబు
  • ఐప్యాక్ డైరెక్షన్‌లో ఇంకెన్ని డ్రామాలు చూడాల్సి వస్తుందోనని ఎద్దేవా
  • సీఎంకే భద్రత లేకపోవడం జగన్ చేతకానితనానికి నిదర్శనమన్న టీడీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయిదాడి ఘటనకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత మాజీమంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు ఆడిన కోడికత్తి నాటకానికి అమాయక దళిత యువకుడు ఐదేళ్లు జైలులో ఉన్నాడని, ఇప్పుడీ రాయి డ్రామాకు ఏ దళితుడిని బలిచేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఐప్యాక్ డైరెక్షన్‌లో ఇంకెన్ని డ్రామాలు చూడాల్సి వస్తుందోనని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికే భద్రత లేకపోవడం జగన్ చేతకానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ ఐప్యాక్ ఆధ్వర్యంలో పథకం ప్రకారం జరిగిందేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బాబాయిని చంపించి చంద్రబాబు మీద దుష్ప్రచారం చేసి లబ్ధిపొందారని, వివేకా రక్తపు పునాదుల మీదే జగన్ ప్రభుత్వం ఏర్పడిందని సొంత చెల్లెల్లే చెబుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.


More Telugu News