ఇరాన్ డ్రోన్లను కూల్చివేయడంలో ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం
- నిన్నటి నుంచి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్న ఇరాన్
- నేడు 100కుపైగా డ్రోన్ల ప్రయోగం
- బైడెన్-నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ
- తమకు హానిచేసే వారిని వదిలిపెట్టబోమన్న నెతన్యాహు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్‌పై నిన్న 200 క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ నేడు కూడా దాడులు కొనసాగించింది. తన భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై నేరుగా క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ 100కుపైగా డ్రోన్లను ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. డజన్ల కొద్దీ క్షిపణులు దూసుకెళ్లడం చూసినట్టు ఇరాక్, జోర్డాన్ భద్రతా దళాలు తెలిపాయి.
ఇరాన్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చివేయడంలో ఇజ్రాయెల్‌కు సాయం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నట్టు శ్వేతసౌధం తెలిపింది. బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరూ ఫోన్‌లో సంభాషించుకున్న అనంతరం వైట్‌హౌస్ ఈ ప్రకటన చేసింది. నెతన్యాహు మాట్లాడుతూ.. తమకు హాని చేసేవారిని వదిలిపెట్టబోమని, వారికి కూడా హాని తప్పదని హెచ్చరించారు. ముప్పు నుంచి తమను తాము రక్షించుకుంటామని తెలిపారు.