సీఎం జగన్‌పై దాడి ఘటన గురించి ఈసీ ఆరా!
- విజయవాడ సీపీకి ఎపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా ఫోన్
- ఏం జరిగిందనేదానిపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
- దాడి నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు బ్రేక్
- యాత్ర తదుపరి షెడ్యూల్‌పై నేడు క్లారిటీ ఇవ్వనున్న వైసీపీ
విజయవాడలో శనివారం సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి గురించి ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. ఘటనపై విజయవాడ సీపీతో ఏపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా ఫోన్‌లో మాట్లాడారు. ఏం జరిగిందనే దానిపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితులను త్వరగా గుర్తించాలని సీపీకి సూచించారు.
మరోవైపు, రాయిదాడిలో గాయపడ్డ సీఎం జగన్‌ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. నుదుటిపై వాపు ఎక్కువగా ఉండటంతో రెస్ట్ అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం తన యాత్రకు నేడు విరామం ఇచ్చారు. యాత్ర తదుపరి షెడ్యూల్‌పై వైసీపీ నేడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.