తొలిసారిగా తెలుగులో పాట రాసి ఆలపించిన ఎమ్మెల్యే రాజాసింగ్
- శ్రీరామనవమి పురస్కరించుకుని పాట పాడిన రాజాసింగ్
- ‘హిందువుగా పుట్టాలి..’ అంటూ సాగిన పాట ప్రోమో నెట్టింట హల్‌చల్
- ఈ నెల 17న శ్రీరామ నవమి శోభయాత్ర సందర్భంగా పూర్తి పాట విడుదల
సంచలనాలకు కేరాఫ్‌గా మారిన గోషామహల్ (హైదరాబాద్) బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తన అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. శ్రీరామనవమి పురస్కరించుకుని ఆయన తొలిసారిగా తెలుగులో స్వయంగా ఓ పాట రాసి పాడారు. శనివారం ఈ పాట ట్రయల్‌ను విడుదల చేశారు. ‘‘హిందువుగా పుట్టాలి.. హిందువుగా బతకాలి.. హిందువుగా చావాలిరా.. కాషాయ మెత్తాలి ముందడుగు వేయాలి.. పులిగా గర్జించాలిరా తమ్ముడూ’’ అంటూ సాగిన పాట నెట్టింట సందడి చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది.
పూర్తి పాటను ఈ నెల 17న ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం వద్ద విడుదల చేసి శోభయాత్ర ప్రారంభిస్తారు. 13 ఏళ్ల క్రితం నగరంలోని ధూల్‌పేట కేంద్రంగా రాజా సింగ్ శ్రీరామ నవమి శోభయాత్రకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.