పంజాబ్ కింగ్స్ ను కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్
- ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసిన పంజాబ్
ముల్లన్ పూర్ లో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ తడబాటుకు గురైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 147 పరుగులు చేసింది.
అశుతోష్ శర్మ 31, లివింగ్ స్టన్ 21, జితేశ్ శర్మ 29 పరుగులు చేశారు. చివర్లో అశుతోష్ శర్మ దూకుడుగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. శర్మ 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు బాదాడు. తాత్కాలిక సారథి శామ్ కరన్ (9), హార్డ్ హిట్టర్ శశాంక్ సింగ్ (9) విఫలమయ్యారు.
ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (15), అథర్వ తైదే (15) శుభారంభం అందించలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 2, కేశవ్ మహరాజ్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, కుల్దీప్ సేన్ 1, చహల్ 1 వికెట్ తీశారు.
అనంతరం, సులభ సాధ్యమైన లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 23, తనుష్ కొటియాన్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.