కవిత అరెస్ట్‌పై కేటీఆర్‌కు సమాచారం కావాలంటే అక్కడకు వెళ్లాలి: బండి సంజయ్
- కవిత అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం లేదని స్పష్టీకరణ
- ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బీఆర్ఎస్ నేతలే చెప్పారన్న బండి సంజయ్
- బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ఎద్దేవా
- రాజకీయ ఐపీఎల్ మ్యాచ్‌లో మోదీ గెలుస్తున్నారన్న సంజయ్
ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్‌పై కేటీఆర్‌కు ఏదైనా సమాచారం కావాలంటే ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న ఈడీ, సీబీఐలను అడగాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సూచించారు. కవిత అరెస్ట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బీఆర్ఎస్ నేతలే చెప్పారని, అలాంటప్పుడు ఈ కేసులో అరెస్టులు ఎందుకు జరగలేదు? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే కేటీఆర్ ఢిల్లీలో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.
ప్రజలను తెలివిలేనోళ్లు అని కేటీఆర్ అనడం దారుణమని బండి సంజయ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని ప్రజలనే అంటావా? అని నిలదీశారు. 'తెలంగాణ ప్రజలారా... బీఆర్ఎస్‌ను తన్ని తరిమేయండి' అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలారా... మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే 'క్విట్ బీఆర్ఎస్' అంటూ ఆ పార్టీని వీడాలని సూచించారు.
రాజకీయాల్లో ఐపీఎల్ మ్యాచ్
ఐపీఎల్ క్రికెట్లోనే కాదని... రాజకీయాల్లోనూ ఉందన్నారు. దేశ రాజకీయాల్లో ఐపీఎల్ కెప్టెన్ నరేంద్రమోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గుంట నక్కల్లా వస్తున్నాయని... కానీ వారు ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో వారు దారుణంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. రాజకీయ ఐపీఎల్లో మోదీ గెలవబోతున్నారన్నారు.