ఫోన్ ట్యాపింగ్ అయిందని ఫిర్యాదు చేస్తే కేటీఆర్ పరువునష్టం నోటీసు ఇవ్వడమేమిటి?: కేకే మహేందర్ రెడ్డి
- ఫోన్ ట్యాప్ అయిందని ఫిర్యాదు చేస్తే కేటీఆర్‌కు పూనకం వచ్చిందని ఎద్దేవా
- కేటీఆర్ తనకు ఇచ్చిన నోటీసులు చట్ట విరుద్ధమన్న మహేందర్ రెడ్డి
- కేసీఆర్ కుటుంబంలోనే ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని వ్యాఖ్య
రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తన ఫోన్ ట్యాప్ అయిందని తాను ఫిర్యాదు ఇస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పూనకం వచ్చిందని, కేటీఆర్ తనకు ఇచ్చిన నోటీసులు చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ తనను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబంలోనే ఒకరిపై మరొకరికి నమ్మకం లేదన్నారు. అయినా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేస్తే కేటీఆర్ పరువు నష్టం నోటీసు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. కేటీఆర్ మాత్రం మా లీడర్లపై అనుమానం వ్యక్తం చేయవచ్చా? అని నిలదీశారు.