హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు ఉన్నాయన్న మాధవీలత విమర్శలపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
- హైదరాబాద్ లోక్ సభ పరిధిలో 6 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయన్న మాధవీలత
- బీజేపీ అభ్యర్థి ఆరోపణలను ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
- ఎన్నికల సంఘానికి తాను హెడ్‌ను కాదని వ్యాఖ్య
- బోగస్ ఓట్లు అంటే ఎన్నికల సంఘాన్ని, హైదరాబాద్ ప్రజలను అవమానించడమేనన్న అసదుద్దీన్
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బోగస్ ఓట్లు ఉన్నాయన్న బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ఆరోపణలపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో 6 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను అసదుద్దీన్ ఖండించారు. ఓటరు జాబితా గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. వీటిలో మన పాత్ర ఏమీ ఉండదన్నారు. ఓటరు జాబితాలో కొత్త పేర్లను జోడించడం, తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం వంటివి అన్నీ ప్రతి ఏడాది ఎన్నికల సంఘం చూసుకుంటుందని చెప్పారు.
ఎన్నికల సంఘానికి తాను హెడ్‌ను ఏమీ కాదని ఎద్దేవా చేశారు. బోగస్ ఓట్లు అంటే ఎన్నికల సంఘాన్ని అవమానించడమే అన్నారు. అలా మాట్లాడటం ద్వారా హైదరాబాద్ ప్రజలను కూడా అవమానిస్తున్నట్లే అన్నారు. ఈ నియోజకవర్గంలో దళిత, వెనుకబడిన, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారని, వారి ఓట్లతోనే తాము గెలుస్తున్నట్లు చెప్పారు.