‘జితేందర్‌రెడ్డి’ నుంచి ‘అఆఇఈ’ సాంగ్.. మాస్‌బీట్‌లో కిక్కెక్కిస్తున్న పాట
- మే 3న విడుదల కానున్న ‘జితేందర్‌రెడ్డి’
- 1980ల నాటి వాస్తవ కథతో రూపొందుతున్న సినిమా
- కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఆకట్టుకుంటున్న పాట
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో రాకేశ్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘జితేందర్‌రెడ్డి’. 1980లలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇటీవల విడుదలైన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి.
ముదుగంటి క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నుంచి తాజాగా ‘అఆఈఈఉఊ’ లిరికల్ సాంగ్ విడుదలైంది. కాలేజీలో ఆర్ట్స్, సైన్స్, ఇంగిలీషు.. అంటూ మాస్‌బీట్‌లో సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘ఐన్‌స్టీన్, న్యూటన్‌లే కాదు. మనకు ఎందరో ఉన్నారు హిస్టరీ తిప్పావంటే’ అంటూ ఆలోచించేలా సాగింది. మే 3న సినిమా విడుదల కానుంది.