నేటి నుంచి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారం.. ఈరోజు తొలి సభ!
- ఈ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ
- చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్
- ఈ నెల 16న కేసీఆర్ రోండో సభ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. నేడు కేసీఆర్ తొలి సభ జరగబోతోంది. చేవెళ్లలోని ఫరా కాజేజ్ గ్రౌండ్ లో సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేవెళ్ల ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ రెండు సార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. కేసీఆర్ తొలి సభకు రెండు లక్షల మంది జనాలను రప్పించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు.
మరోవైపు సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలె యాదయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పారు. ఈ నెల 16న సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారని తెలిపారు. సుల్తాన్ పూర్ శివారులోని సింగూర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కేటీఆర్, హరీశ్ రావు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.