ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
- శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు
- 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు ప్రకటన
- మార్చి 17వ తేదీన జరిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష
- గతేడాది డిసెంబర్‌లో 81 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్‌సీ
గత నెల 17వ తేదీన జరిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అధికారులు.. ఇప్పుడు ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించారు. మొత్తంగా 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, వివిధ కారణాలతో పేపర్-1, పేపర్-2లకు సంబంధించి మొత్తం 567 మంది అభ్యర్థుల జవాబు పత్రాలు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు మెయిన్స్ పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఇక గతేడాది డిసెంబర్‌లో ఏపీపీఎస్‌సీ 81 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి