ఐపీఎల్: ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ

  • లక్నోలోని వాజ్ పేయి స్టేడియం వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
  • ఇంకా కోలుకోని మయాంక్ యాదవ్
  • మయాంక్ స్థానంలో లక్నో జట్టులోకి అర్షద్ ఖాన్
ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు లక్నోలోని వాజ్ పేయి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

కాగా, గత మ్యాచ్ లో ఒక ఓవర్ విసిరి మైదానాన్ని వీడిన లక్నో సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నేటి మ్యాచ్ కు దూరమయ్యాడు. మయాంక్ యాదవ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. అతడి స్థానంలో లక్నో జట్టులోకి అర్షద్ ఖాన్ ను ఎంపిక చేశారు. అటు, ఢిల్లీ జట్టులోకి కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్ పునరాగమనం చేశారు. 

ఇరుజట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, నికోలాస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, ట్రిస్టాన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్.


More Telugu News