అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: ప్రధాని నరేంద్ర మోదీ

  • బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తోందన్న ప్రధాని
  • కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందని విమర్శ
  • కాంగ్రెస్ ఎవరి సూచనల మేరకు పని చేస్తుందో చెప్పాలని నిలదీత
తమ ప్రభుత్వానికి రాజ్యాంగమే సర్వస్వమని... ఇప్పుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వయంగా వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తోందన్నారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందని విమర్శించారు.

దేశాన్ని బలహీనపరిచేందుకు విపక్ష ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించడం ద్వారా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. అలాంటి పార్టీ ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్షాలు అణునిరాయుధీకరణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పొరుగున అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఉండగా వీటి నిర్మూలన గురించి మాట్లాడుతారా? అని నిలదీశారు. ఎవరి సూచనల మేరకు... ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పని చేస్తుందో చెప్పాలన్నారు.


More Telugu News