వైసీపీకి రాజీనామా చేసిన గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా
- గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ
- టీడీపీలో చేరనున్న క్రిస్టినా, ఆమె భర్త సురేశ్ కుమార్
- తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా వ్యవహరించిన సురేశ్ కుమార్
- తాడికొండ టికెట్ సుచరితకు ఇచ్చిన వైసీపీ హైకమాండ్
గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేశ్ కుమార్ నేడు వైసీపీకి రాజీనామా చేశారు. క్రిస్టినా, సురేశ్ కుమార్ దంపతులు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొల్లూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువాలు కప్పుకోనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే క్రిస్టినా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త కత్తెర సురేశ్ కుమార్ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా వ్యవహరించారు.
అయితే, వైసీపీ అధిష్ఠానం ఇటీవల తాడికొండ అసెంబ్లీ సీటును మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు కేటాయించింది. ఈ కారణంగానే క్రిస్టినా దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.