బైడెన్​ సూర్య గ్రహణాన్ని చూస్తే.. పుతిన్​ కనిపించాడంటూ..

  • అమెరికా అధ్యక్షుడిపై దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం సెటైర్
  • బైడెన్ సోలార్ ఫిల్టర్ తో చూస్తే.. చందమామకు వదులు పుతిన్ కనిపించినట్టుగా ‘ఎక్స్’లో ఫొటో పోస్ట్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
అమెరికా, రష్యా రెండూ అగ్రరాజ్యాలు.. పైగా ఒకదానికొకటి పోటీ. అందుకే వాటి అధ్యక్షులకు ఉండే క్రేజ్ వేరే లెవల్. ఒక దేశ అధ్యక్షుడిపై మరో దేశ ప్రజలు సెటైర్లు వేసుకోవడమూ మామూలే. కానీ ఏప్రిల్ 9 నాటి సంపూర్ణ సూర్య గ్రహణం సమయంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై సెటైర్ వేస్తూ.. దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ భలేగా పేలింది.

చంద్రుడికి బదులు పుతిన్ కనిపిస్తూ..
రష్యా రాయబార కార్యాలయం చేసిన పోస్ట్ లో ఒక ఫొటోను పెట్టింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ నేరుగా సూర్య గ్రహణాన్ని చూస్తున్నప్పుడు.. సూర్యుడిని చంద్రుడు కప్పేస్తూ ఉంటాడు. అదే ఫొటోలో కింద.. బైడెన్ కళ్లకు సోలార్ ఫిల్టర్స్ పెట్టుకుని చూస్తుంటాడు. అప్పుడు సూర్యుడిని కప్పేస్తూ.. చంద్రుడికి బదులు పుతిన్ ముఖం ఆకృతి కనిపిస్తుంటుంది.

వైరల్ గా మారిన పోస్ట్..
ఇరు దేశాల ప్రజలు అధ్యక్షులపై పరస్పరం సెటైర్లు వేసుకోవడం సాధారణమే అయినా.. ఇలా ఒక దేశ రాయబార కార్యాలయం అధికారిక ఖాతాలో ఇలాంటి పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దానికి మిలియన్ కుపైగా వ్యూస్ వచ్చాయి.


More Telugu News