హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ

  • తమపై నమోదైన కేసుల వివరాలను ఇప్పించాలని పిటిషన్లు
  • ఈ నెల 16లోగా కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణ కూడా పిటిషన్లు వేశారు. తమపై నమోదైన కేసుల వివరాలను ఇప్పించాలని వారు హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 16లోగా కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఎన్నికల నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తమపై ఉన్న కేసుల వివరాలను కూడా అభ్యర్థులు అందజేయాల్సి ఉంది. వారిచ్చే సమాచారంలో ఏ ఒక్కటి మిస్ అయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే, వీరంతా కేసుల వివరాలను కోరారు.


More Telugu News