హైదరాబాద్ లో కేఆర్ఎంబీ ట్రైబ్యునల్ కీలక సమావేశం

  • తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు
  • వేసవి నీటి కేటాయింపుల కోసం నేడు కేఆర్ఎంబీ ట్రైబ్యునల్ సమీక్ష
  • రెండు తెలుగు రాష్ట్రాలకు 14 టీఎంసీల నీటి కేటాయింపు
  • తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీంఎసీల నీరు కేటాయింపు
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ట్రైబ్యునల్ నేడు హైదరాబాదులో కీలక సమావేశం నిర్వహించింది. వేసవిలో నీటి కేటాయింపులపై చర్చ జరిపింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. అందులో తెలంగాణకు అత్యధికంగా 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని సర్దుబాటు చేసింది. మే నెలలో మరోసారి సమావేశం కావాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. 

కేఆర్ఎంబీ ట్రైబ్యునల్ గత అక్టోబరులో సమావేశమై నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ ల నీటి నిల్వలు, కేటాయింపులను సమీక్షించింది. రెండు జలాశయాల్లో 82కి పైగా టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్టు గుర్తించి... ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీల నీటిని కేటాయించింది.


More Telugu News