ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

  • మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షల నిర్వహణ
  • ఇంటర్ రిజల్ట్స్ అనంతరం ప్రకటించిన బోర్డు అధికారులు
  • నేడు విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఈ వివరాలను కూడా వెల్లడించారు. అయితే, పరీక్ష ఫీజులు, గడువు తేదీ వంటి వివరాలను తెలపాల్సి ఉంది. కాగా ఏపీ ఇంటర్మీడియెట్ ఫలితాలను బోర్డు అధికారులు శుక్రవారం 11 గంటలకు విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఫలితాలను రిలీజ్ చేశారు. 

ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయగా కృష్ణా ప్రథమ, గుంటూరు ద్వితీయ, ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి. http://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు.


More Telugu News