జగన్ బాధితుడు రఘురామకృష్ణరాజుకు న్యాయం చేయాలి: ఉండి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా చంద్రబాబు
- రామరాజు ఎంతో కష్టపడి పని చేశారని కితాబు
- రామరాజుపై ఎలాంటి వివక్ష లేదని వ్యాఖ్య
- రఘురాజు, రామరాజు ఇద్దరికీ న్యాయం చేస్తామని హామీ
ఏపీలో ప్రస్తుతం ఉండి నియోజకవర్గంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును టీడీపీ ప్రకటించింది. అయితే, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈ స్థానాన్ని కేటాయిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇటీవల రఘురాజు ఆ పార్టీలో చేరడం... ఉండి నియోజకవర్గం పరిధిలో ఆయన పార్టీ ప్రచార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో రామరాజు అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఉండి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు పిలుపు మేరకు రామరాజు కూడా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్ బాధితుడని చంద్రబాబు అన్నారు. రఘురాజుకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజలు కూడా రఘురాజుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. రామరాజు ఎంతో కష్టపడి పని చేశారని... ఆయనపై ఎలాంటి వివక్ష లేదని తెలిపారు. రఘురాజు, రామరాజు ఇద్దరికీ న్యాయం చేయాలని చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి మంచి చేయాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. బీజేపీని కూడా కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.