షర్మిల చేసిన త‌ప్పిదం అదే: విజ‌య‌సాయి రెడ్డి

  • ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేర‌డం ఆమె చేసిన రాజ‌కీయ త‌ప్పిదమ‌న్న వైసీపీ నేత‌
  • జ‌గ‌న్‌తో ష‌ర్మిల రాజ‌కీయంగా విభేదించిన మాట వాస్త‌వ‌మేన‌న్న విజ‌య‌సాయి 
  • 2014లోనే వైసీపీకి ఎన్‌డీఏలో చేర‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని వెల్ల‌డి
  • తాము కాద‌న్నాకే టీడీపీతో బీజేపీ జ‌త‌క‌ట్టింద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల‌ తెలంగాణ‌లో పార్టీ పెట్టిన‌ప్పుడు తాము ఏమీ అన‌లేద‌ని, కానీ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేర‌డం ఆమె చేసిన రాజ‌కీయ త‌ప్పిదం అని అన్నారు. ఆమె వెనుక ఎవ‌రు ఉన్నారో కూడా అంద‌రికీ తెలుస‌ని విజ‌య‌సాయి అన్నారు. అలాగే సీఎం జ‌గ‌న్‌తో ష‌ర్మిల రాజ‌కీయంగా విభేదించిన మాట వాస్త‌వ‌మేన‌న్నారు. 

ఇక ఎన్‌డీఏలో వైసీపీ చేరిక‌పై కూడా ఆయ‌న మాట్లాడుతూ.. 2014లోనే త‌మ‌కు ఆ ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్నారు. తాము తిర‌స్క‌రించిన త‌ర్వాతే టీడీపీతో బీజేపీ జ‌త‌క‌ట్టిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ ఏ పార్టీతో జ‌త‌క‌ట్టే ప్ర‌స‌క్తే లేదన్నారు. గ‌తంలో కొన్ని అంశాల‌వారీగానే తాము ఎన్‌డీఏకి మ‌ద్ద‌తు ఇచ్చామ‌న్నారు. 

అలాగే వాలంటీర్ల విష‌యంలో తన మాట‌ల‌ను వ‌క్రీక‌రించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయి గుర్తు చేశారు. వాలంటీర్లు తమ కార్య‌క‌ర్త‌ల‌ని తాను అన‌లేద‌ని, త‌మ ప్ర‌భుత్వం నియ‌మించిన వారు అని మాత్రమే చెప్పాన‌న్నారు.


More Telugu News