సెంటిమెంట్ కారణంగానే గతంలో కేసీఆర్ గెలిచారు: రేవూరి ప్రకాశ్ రెడ్డి
- బీఆర్ఎస్ హయాంలో 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయన్న ప్రకాశ్ రెడ్డి
- రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శ
- గత ఏడాది సరైన వర్షాలు లేకపోవడం వల్లే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్య
తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను ఉపయోగించుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత రేవూర్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరితే బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. గత సీజన్ లో వర్షాలు సరిగా పడకపోవడం వల్లే ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని... రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.