స‌జ్జ‌ల‌ రామ‌కృష్ణారెడ్డిపై దేవినేని ఉమా ధ్వ‌జం!

  • స‌జ్జ‌ల‌ రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుమారుడు భార్గ‌వ‌రెడ్డి న‌కిలీ వార్త‌ల ఫ్యాక్ట‌రీ న‌డుపుతున్నారంటూ ‌ఆరోపణ 
  • డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి వారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించిన మాజీ మంత్రి  
  • త‌ప్పుడు వార్త‌ల‌పై ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేస్తామ‌న్న దేవినేని ఉమా
ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుమారుడు భార్గ‌వ‌రెడ్డిపై టీడీపీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ధ్వ‌జ‌మెత్తారు. తండ్రీకొడుకులు రాష్ట్రంలో న‌కిలీ వార్త‌ల ఫ్యాక్ట‌రీ న‌డుపుతున్నార‌ని ఆరోపించారు. డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి వారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. గురువారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. 

"తాడేప‌ల్లిలోని నెస్ట్ స్పేస్ భ‌వ‌నంలో న‌కిలీ వార్త‌ల‌ను సృష్టిస్తూ సామాజిక మాధ్య‌మాలలో పోస్టు చేస్తున్నారు. దీనిలో ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఉద్యోగులు 300 మంది ప‌ని చేస్తున్నారు. వార్త ఛానెళ్ల లోగోల‌ను మార్చి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఓడిపోతామ‌న్న నిరాశ‌తోనే స‌జ్జ‌ల ఇలా దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ నుంచి జీతం తీసుకుంటున్న ఆయ‌న ఎవ‌రికి స‌ల‌హాలు ఇస్తున్నారు? త‌ప్పుడు వార్త‌ల‌పై త‌ప్ప‌కుండా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తాం" అని అన్నారు.


More Telugu News