ఆర్‌సీబీపై బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. మ్యాక్స్‌వెల్ పేరిట చెత్త రికార్డు!

  • ఆర్‌సీబీపై 5 వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా
  • రెండుసార్లు 5 వికెట్లు తీసిన ఫాల్క‌న‌ర్, ఉనాద్క‌త్, భువ‌నేశ్వ‌ర్ స‌ర‌స‌న భార‌త మీడియం పేస‌ర్‌
  • అలాగే ఆర్‌సీబీపై అత్య‌ధిక వికెట్లు (29) తీసిన బౌల‌ర్‌గానూ బుమ్రా రికార్డు
  • ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా (21సార్లు) 3 వికెట్ల హౌల్ సాధించిన బౌల‌ర్‌గా స‌రికొత్త రికార్డు
  • ఐపీఎల్‌లో అత్య‌ధిక‌సార్లు (17) డ‌కౌటైన ఆట‌గాడిగా దినేశ్ కార్తీక్, రోహిత్ శ‌ర్మ స‌ర‌స‌న మ్యాక్స్‌వెల్
వాంఖ‌డే మైదానంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) తో గురువారం జ‌రిగిన మ్యాచులో ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 21 ప‌రుగులే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై 5 వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా బుమ్రా అవ‌త‌రించాడు. చివ‌రిగా ఆశిష్ నెహ్రా సీఎస్‌కే త‌ర‌ఫున 4 వికెట్లు తీశాడు. ఇప్ప‌టివ‌ర‌కూ బెంగ‌ళూరుపై అదే అత్యుత్త‌మం. 

అలాగే ఐపీఎల్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీసిన ఫాల్క‌న‌ర్, ఉనాద్క‌త్, భువ‌నేశ్వ‌ర్ స‌ర‌స‌న బుమ్రా కూడా చేరాడు. అలాగే ఆర్‌సీబీపై అత్య‌ధిక వికెట్లు (29) తీసిన బౌల‌ర్‌గానూ బుమ్రా రికార్డుకెక్కాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా 3 వికెట్ల హౌల్‌ సాధించిన బౌల‌ర్‌గా అవ‌త‌రించాడు. ఈ హౌల్‌ను బుమ్రా ఏకంగా 21 సార్లు న‌మోదు చేయ‌డం విశేషం. అలాగే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని అత్య‌ధిక‌సార్లు (5) పెవిలియ‌న్ పంపించిన బౌల‌ర్‌గానూ నిలిచాడు. 

చెత్త రికార్డు న‌మోదు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్
అటు ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట‌ ఓ చెత్త రికార్డు న‌మోదైంది. ఐపీఎల్‌లో అత్య‌ధిక‌సార్లు (17) డ‌కౌటైన ఆట‌గాడిగా దినేశ్ కార్తీక్, రోహిత్ శ‌ర్మ స‌ర‌స‌న చేరాడు. ఇక నిన్న‌టి మ్యాచ్‌లో ఎంఐ విధ్వంసం సృష్టించిన విష‌యం తెలిసిందే. బెంగ‌ళూరు విధించిన 197 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 15.3 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. కేవ‌లం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 27 బంతులు మిగిలి ఉండ‌గానే మ్యాచును ముగించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (69), సూర్య‌కుమార్ యాద‌వ్ (52) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు.


More Telugu News