కోహ్లీ తక్కువ స్కోరుకే అవుట్... ఆదుకున్న డుప్లెసిస్, పాటిదార్
- ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్ × ఆర్సీబీ
- వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- 12 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసిన ఆర్సీబీ
- 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటైన కోహ్లీ
ఐపీఎల్ లో ఇవాళ ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని సుప్రసిద్ధ వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఆర్సీబీ మొదట బ్యాటింగ్ కు దిగగా... విరాట్ కోహ్లీ 3 పరుగులకే బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన విల్ జాక్స్ (8) సైతం తక్కువ స్కోరుకే అవుట్ అయినప్పటికీ... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పాటిదార్ జోడీ దూకుడుగా ఆడింది. ముంబయి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ, స్కోరును సెంచరీ మార్కు దాటించింది. రజత్ పాటిదార్ అర్ధసెంచరీ నమోదు చేసి అవుటయ్యాడు. పాటిదార్ 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 50 పరుగులు చేశాడు.
ప్రస్తుతం బెంగళూరు జట్టు స్కోరు 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. డుప్లెసిస్ 41 పరుగులతో, మ్యాక్స్ వెల్ పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 1, మధ్వాల్ 1, కోట్జీ 1 వికెట్ తీశారు.