ఫోన్ ట్యాపింగ్ కేసు... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు
  • జీవో ఆధారంగా కోర్టులో పంజాగుట్ట పోలీసుల మెమో
  • ఈ నెల 15న నిర్ణయం తీసుకోనున్న నాంపల్లి కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు.


More Telugu News