తెలంగాణలో కాంగ్రెస్ తీసుకువస్తానన్న మార్పు ఏమిటి?: కిషన్ రెడ్డి
- కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపణ
- ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మార్పు వచ్చిందని ఎద్దేవా
- మజ్లిస్ పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని విమర్శ
తెలంగాణలో కాంగ్రెస్ తీసుకువస్తానన్న మార్పు ఏమిటి? అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మార్పు వచ్చిందని ఎద్దేవా చేశారు.
మతాన్ని అడ్డం పెట్టుకొని మజ్లిస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని రగిలిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేశాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొత్త నాటకానికి తెర తీశాయని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.