చంద్రబాబు నిన్నటి దాకా వాలంటీర్లను ఇష్టం వచ్చినట్టు తిట్టారు: అంబటి రాంబాబు

  • నిన్నటి దాకా వాలంటీర్లపై నీచమైన అపవాదులు వేశారన్న అంబటి
  • ఇప్పుడు వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతామంటున్నారని విమర్శ
  • చంద్రబాబు ఎమ్మెల్యే కూడా కాలేరని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. నిన్నటి దాకా వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు తిట్టారని... వాలంటీర్లపై నీచమైన అపవాదులు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతామని ఇప్పుడు చంద్రబాబు అంటున్నారని చెప్పారు. ఇది మాయ మాటలు చెప్పడం కాదా? ఇది ఎన్నికల స్టంట్ కాదా? అని ప్రశ్నించారు. వాలంటీర్ల విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఒక్క రోజులో నాలుక మడతేశారని ఎద్దేవా చేశారు. 

ఇక పల్నాడు జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏ పేదవాడిని అడిగినా ముఖ్యమంత్రి జగనే అని చెపుతున్నారని... చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పని చేశారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా... ఎమ్మెల్యే కూడా కాలేరని చెప్పారు. చంద్రబాబు ప్రజా నాయకుడు కాదని అన్నారు.


More Telugu News