మీవల్ల కాకపోతే చెప్పండి.. మేం మీకు సహకరిస్తాం: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ దాయాది దేశంపై నిప్పులు
- ముష్కర మూకలతో భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక
- ఉగ్రవాదాన్ని అరికట్టడం చేతకాదని పాకిస్థాన్ భావిస్తే ఆ దేశానికి సహకారం అందిస్తామని వెల్లడి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పాకిస్థాన్‌ను హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ దాయాది దేశంపై నిప్పులు చెరిగారు. ముష్కర మూకలతో భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడం మీవల్ల కాదని పాక్ భావిస్తే, ఆ విషయంలో సహకారం అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వున్న రాజ్‌నాథ్ సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పైన విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు తనకు పెరోల్ ఇవ్వలేదని, అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ తమను నియంతలుగా పేర్కొంటోందని మండిపడ్డారు.