యువతి ప్రాణాలు తీసిన డ్రగ్స్ ఓవర్ డోస్!
- థ్రిల్ కోసం డ్రగ్స్ వినియోగం.. 18 ఏళ్ల యువతి మృతి
- డ్రగ్స్ తీసుకుంటే థ్రిల్ వస్తుందని చెప్పి యువతి ప్రాణాలు తీసిన యువకుడు
- యూపీలోని లక్నో పరిధిలోని తివారీగంజ్‌లో ఘటన
నేటితరం యువత లేనిపోని అలవాట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా యూపీలోని లక్నో పరిధిలోని తివారీగంజ్‌లో 18 ఏళ్ల ఓ యువతి డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులో పనిచేసే ఓ యువతి (18) ఈ నెల 3వ తేదీన లక్నోలోని తన ఇంటికి వచ్చింది. ఆ తర్వాత 7న తిరిగి బెంగళూరు వెళ్లే క్రమంలో ఆమె తన స్నేహితుడు వివేక్ మౌర్యను కలిసింది. అతడు ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ డ్రగ్స్ తీసుకుంటే థ్రిల్ వస్తుందని చెప్పి ఓ సిరంజిని ఇంజెక్ట్ చేశాడు.
అంతే.. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావడంతో యువతి కొంతసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అది చూసిన యువకుడు భయపడి తానూ డ్రగ్స్ మత్తులో ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఇక యువతి చనిపోవడంతో యువకుడు మెల్లగా ఆసుపత్రి నుంచి జారుకున్నాడు. దాంతో పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతురాలి తల్లిదండ్రులు.. యువకుడు కావాలనే తమ కూతురును హత్య చేసి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు.