వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన గుజరాత్, రాజస్థాన్ ఐపీఎల్ మ్యాచ్
- ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుటైన యశస్వి జైస్వాల్
జైపూర్ లో వర్షం కురవడంతో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచినప్పటికీ, జట్టు ఎంపిక కొంచెం ఇబ్బందికరంగానే ఉంటోందని అభిప్రాయపడ్డాడు.
ఇక, గుజరాత్ జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో మాథ్యూ వేడ్ తుదిజట్టులోకి వచ్చాడు. శరత్ స్థానంలో అభినవ్ మనోహర్ ను ఎంపిక చేశారు.
కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. గత కొన్ని మ్యాచ్ ల్లో వరుసగా విఫలమవుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. ఈ వికెట్ ఉమేశ్ యాదవ్ కు దక్కింది. జైస్వాల్ 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ (9 బ్యాటింగ్), కెప్టెన్ సంజూ శాంసన్ (8 బ్యాటింగ్) ఉన్నారు.