మీ బిడ్డ భర్తీ చేసిన ఉద్యోగాలు ఎక్కడ... ఆ చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాలు ఎక్కడ?: పిడుగురాళ్ల సభలో సీఎం జగన్
- పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభ
- తాము 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న జగన్
- చంద్రబాబు 32 వేల ఉద్యోగాలే ఇచ్చాడని వ్యాఖ్యలు
- జాబు రావాలి అంటే మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని వివరణ
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఎం జగన్ ఈ సాయంత్రం మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, యువతకు ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారు. తాను అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశానని వెల్లడించారు. గతంలో చంద్రబాబు ఇచ్చింది 32 వేల ఉద్యోగాలేనని విమర్శించారు. మీ బిడ్డ భర్తీ చేసిన 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఎక్కడ, చంద్రబాబు ఇచ్చిన 32 వేల ఉద్యోగాలు ఎక్కడ? అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మరి జాబు రావాలి అంటే అధికారంలోకి రావాల్సింది ఎవరు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య రంగంలోనే 54 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని వెల్లడించారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 1.35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని... జాబు రావాలి అంటే ఎవరు కావాలి, ఎవరు అధికారంలోకి రావాలి? అని ప్రశ్నించారు. జాబు రావాలి అంటే ఫ్యాన్ రావాలా, లేక తుప్పుపట్టిన సైకిల్ రావాలా? అని అడిగారు.
ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబు కు మధ్య జరిగే ఎన్నికలు కావని, ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలు అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు. ఎల్లో మీడియా గాడిదను తీసుకువచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయని సీఎం జగన్ విమర్శించారు. తాము సిద్ధం సిద్ధం అంటుంటే వారికి యుద్ధం అని ప్రతిధ్వనిస్తోందని అన్నారు.
జిత్తులమారి చంద్రబాబు కుట్రలను మరోసారి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటేస్తే పేదలు మోసపోవడం తథ్యమని, ఎన్నికలకు ముందు గంగలా ఉండే చంద్రబాబు, ఎన్నికలు అయిపోయాక చంద్రముఖిలా మారిపోతారని వ్యంగ్యం ప్రదర్శించారు.
వైసీపీ ఎప్పుడూ పేదల పార్టీయేనని, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డ జగన్ కు ఓటేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.