బ్రహ్మపుత్ర నదిని దాటనీయని దెయ్యం: భయపెట్టడానికి రెడీ అవుతున్న 'బాక్'

  • 'అరణ్మనై' సిరీస్ నుంచి 4వ భాగం 
  • తెలుగులో 'బాక్' టైటిల్ ఖరారు
  • దర్శక నిర్మాతగా ఉన్న సుందర్ సి. 
  • ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల  

సుందర్ సి. పేరు వినగానే ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అరణ్మనై' సిరీస్ గుర్తొస్తుంది. ఇంతవరకూ ఈ సిరీస్ లో భాగంగా 3 సినిమాలు వచ్చాయి. వాటిలో  మొదటి రెండు సినిమాలు తెలుగులో కూడా విజయవంతమయ్యాయి.  ఈ నేపథ్యంలో 'అరణ్మనై 4' విడుదలకు ముస్తాబవుతోంది. తమన్నా - రాశిఖన్నా ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు. 

సుందర్ సి. ఈ సినిమాకి దర్శక నిర్మాతగా .. రచయితగా కూడా వ్యవహరించాడు. 'అరణ్మనై 4' సినిమాకి తెలుగులో 'బాక్' అనే టైటిల్ ను ఖాయం చేసి, కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను వదిలారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఖుష్బూ .. సిమ్రాన్ .. యోగిబాబు .. కోవై సరళ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

బ్రహ్మపుత్ర నదీ అవతల తీరంలోని ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ఏ రాజులూ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అందుకు గల కారణాలలో, ఆ ప్రాంతంలో తిరిగే 'బాక్' అనే దెయ్యమేననేది ఒక కారణంగా చెబుతారు. ఆ ప్రాంతవాసులు ఆ దెయ్యం గురించి కథలు కథలుగా చెబుతారు. ఆ అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి మరి. 


More Telugu News