లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 354 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 111 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- రెండున్నర శాతం పెరిగిన ఐటీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 75,038కి చేరుకుంది. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,754 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సూచీలు 1.74 శాతానికి పైగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.49%), కోటక్ బ్యాంక్ (2.40%), భారతి ఎయిర్ టెల్ (2.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.94%), ఏసియన్ పెయింట్స్ (1.36%).
టాప్ లూజర్స్:
మారుతి (-1.60%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.83%), ఎల్ అండ్ టీ (-0.78%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.62%), టాటా స్టీల్ (-0.48%).