రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన రేణుకా చౌదరి

  • మూడోసారి రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ నేత
  • ఇటీవలే ఏకగ్రీవమైన రేణుకా చౌదరి అభ్యర్థిత్వం
  • ప్రమాణస్వీకార సమయంలో రేణుక వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు. రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తవ్వడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాగా మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు. 

ఇటీవల తెలంగాణలోని పలు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగగా రేణుకా చౌదరి సహా పలువురి అభ్యర్థిత్వాలు ఏకగ్రీవమయ్యాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరపున  రేణుకా చౌదరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇక బీఆర్ఎస్ తరపున ఏకైక అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.


More Telugu News