'శకారంభం' పుస్తకాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్
- నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అక్షరరూపమిచ్చిన పెమ్మరాజు కృష్ణకిశోర్
- నారా లోకేశ్ నివాసంలో పుస్తకావిష్కరణ
- శకారంభం పుస్తక రచయితను అభినందించిన నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. యువగళంపై సీనియర్ పాత్రికేయుడు పెమ్మరాజు కృష్ణకిశోర్ శకారంభం పేరిట ఓ పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని నారా లోకేశ్ తన నివాసంలో నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెమ్మరాజు కృష్ణకిశోర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పుస్తకావిష్కరణపై లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.
"రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా నేను చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు అక్షర రూపం ఇస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిశోర్ రచించిన శకారంభం పుస్తకాన్ని ఆవిష్కరించాను.
జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధ వర్గాల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ చారిత్రాత్మక పాదయాత్రకు అక్షరూపమిచ్చిన మిత్రుడు కృష్ణకిశోర్ అభినందనీయుడు. యువగళం ప్రధాన ఘట్టాలను రైజ్ యువర్ వాయిస్ యూట్యూబ్ చానల్ ద్వారా ఆయన ప్రజలకు చేరవేశారు.
శకారంభం పుస్తక ప్రచురణకర్త బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.