ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా.. నెట్టింట ఫొటోల వైరల్!
- బాంద్రాలో సముద్రం ఎదురుగా వున్న అపార్ట్ మెంటులో రూ. 20 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న పృథ్వీ షా
- కొత్త ఫ్లాట్ తాలూకు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన యంగ్ క్రికెటర్
- ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా ప్లేయర్
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. సుమారు రూ. 20 కోట్లు దీనికోసం వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలో సముద్రం ఎదురుగా ఈ ఫ్లాట్ ఉంటుంది. ఈ కొత్త ఫ్లాట్ తాలూకు ఫొటోలను పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. దాంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ డాషింగ్ ఓపెనర్‌ను డీసీ ఏకంగా రూ. 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. 2018లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన పృథ్వీని ఢిల్లీ మొదట రూ. 1.2 కోట్లకు దక్కించుకుంది. అప్పటి నుంచి అతడు డీసీ తరఫునే ఆడుతున్నాడు. అయితే, మొదటి సీజన్‌లో పర్వాలేదనిపించిన షా.. ఆ తర్వాత సీజన్లలో ఘోరంగా విఫలమయ్యాడు. కానీ, 2021 నుంచి అతడు మళ్లీ తన మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు.
2021లో 15 మ్యాచుల్లో ఏకంగా 479 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2022లో 10 మ్యాచులు ఆడి 283 రన్స్ కొట్టాడు. ఇక గతేడాది పృథ్వీ బ్యాట్ నుంచి అంతగా పరుగులు రాలేదనే చెప్పాలి. 8 మ్యాచుల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. తాజా సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచుల్లోనే 119 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో మోస్ట్ డేంజరస్ ఓపెనర్‌గా పృథ్వీ షాను పేర్కొనడం జరుగుతోంది. ఎందుకంటే పృథ్వీ క్రీజులో ఉన్నంతసేపు అతని బ్యాట్ నుంచి పరుగుల వరద పారాల్సిందే.