నాది వైజాగ్ అని ఒకరు, ఢిల్లీ నుంచి వచ్చానని ఇంకొకరు రోజూ పిడకలు విసురుతున్నారు: విజయసాయిరెడ్డి

  • తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయసాయి
  • నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ
  • తన స్థానికతపై వస్తున్న విమర్శలకు బదులిచ్చిన వైనం 
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓవైపు విపక్షాల విమర్శలకు బదులిస్తూనే, మరోవైపు ప్రచారం సాగిస్తున్నారు.

తాజాగా తన స్థానికతపై వచ్చిన విమర్శలకు బదులిచ్చారు. నాది వైజాగ్ అని ఒకరు, ఢిల్లీ నుంచి వచ్చానని ఇంకొకరు రోజూ పిడకలు విసురుతున్నారని విపక్ష నేతలపై మండిపడ్డారు. నెల్లూరు నా జన్మభూమి... నేను పుట్టింది, చదువుకుందీ ఇక్కడే... తల్లి నుంచి బిడ్డను వేరు చేసే నీచపు ప్రచారం ఇకనైనా మానుకోండి అని హితవు పలికారు. 

"విమర్శించడానికి మన వద్ద ఆయుధాలేవీ లేనప్పుడు, బకెట్ల కొద్దీ బురద చల్లాలి అనేది చంద్రబాబు అనే సూడో మేధావి సిద్ధాంతం. ఈ ఫార్ములాను ఆయన శిష్యగణం తు.చ తప్పకుండా పాటిస్తున్నారు" అంటూ విజయసాయి ధ్వజమెత్తారు.


More Telugu News