మోసాలు, వంచనలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్: దేవినేని ఉమా
- ఇల్లు పేరిట పేదలను జగన్ నిలువునా మోసం చేశాడంటూ టీడీపీ నేత ధ్వజం
- ఓటీఎస్ పేరిట 7 లక్షల మంది నిరుపేదలకు కుచ్చుటోపీ పెట్టిన ఘనుడన్న దేవినేని
- సెంటుపట్టా పేరుతో సొంత పార్టీ నేతల జేబులు నింపి పేదలను ముంచేశాడని మండిపాటు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని జగన్‌పై ఆయన మండిపడ్డారు. అన్నింటిలో మోసాలు, వంచనలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. మోసాలు, వంచనలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. ఇల్లు పేరిట పేదలను నిలువునా మోసం చేశాడని ధ్వజమెత్తారు.
అంతేగాక గత ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చిన లబ్ధిదారుల వద్ద రూ. 10 వేలు వసూలు చేయడం దారుణమన్నారు. అలాగే ఓటీఎస్ పేరిట 7 లక్షల మంది నిరుపేదలకు కుచ్చుటోపీ పెట్టిన ఘనుడు జగన్ అని ఫైర్ అయ్యారు. వందల కోట్లు వసూలు చేసి చెల్లని కాగితాలు చేతిలో పెట్టాడని దుయ్యబట్టారు. సెంటుపట్టా పేరుతో సొంత పార్టీ నేతల జేబులు నింపి పేదలను ముంచేశాడని ఉమా మండిపడ్డారు.
ఆ పట్టాలపై జగన్ బొమ్మలు తప్ప ప్రజలకు వాటి వల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు. బ్యాంకులు సైతం ఆ పత్రాలు చెల్లవని తేల్చేశాయని గుర్తు చేశారు. ఇలా పనికిరాని పట్టాలతో మోసం చేసిన సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమా ట్వీట్ చేశారు.