ఇది లైంగిక వేధింపుల ‘మరక’.. జర్మనీలో వినూత్న నిరసన

  • మహిళల నగ్న విగ్రహాలతో ప్రదర్శన
  • వేధింపుల మరక జీవితాంతం వదలని ఆవేదన
  • నిత్యం ఎదుర్కొంటున్న వేధింపులపై ‘అన్ సైలెన్స్ ది వయలెన్స్’ అంటూ పిలుపు
ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నంగా ప్రచారం నిర్వహించింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్ సైలెన్స్ ది వయలెన్స్’ అంటూ పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇందులో మహిళల నగ్న విగ్రహాలను ఏర్పాటు చేసింది. విగ్రహాలు మొత్తం ఒక రంగులో, వాటి ప్రైవేట్ పార్ట్స్ మాత్రం మరో రంగులో తయారుచేయించింది. పదే పదే తాకడం వల్ల విగ్రహాల ప్రైవేట్ పార్ట్స్ రంగు మారాయనే అర్థం వచ్చేలా వాటిని తీర్చిదిద్దారు. ఈ విగ్రహాలకు ఏర్పడినట్లు వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని పేర్కొంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యంలాగా ఈ విగ్రహాలు నిలుస్తాయని హక్కుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

జర్మనీకి చెందిన మహిళల హక్కుల సంస్థ ‘టెర్రె డెస్ ఫెమెస్’ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇంటాబయటా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై చాలామంది మౌనం వహిస్తారని పేర్కొంది. ప్రతీ ముగ్గురు మహిళల్లో ఇద్దరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వేధింపులకు గురైన వారేనని చెప్పింది. అయితే, ఈ విషయంపై వారు మౌనంగా ఉండడం వల్ల మరో మహిళ వేధింపులకు గురవుతోందని ఈ సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. అందుకే వేధింపులపై గళమెత్తాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. బాధితుల తరఫున పోరాడాలని, వేధింపులను అరికట్టేందుకు మనమంతా కలిసి ఫైట్ చేయాలని సినా టాన్ ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.


More Telugu News