ప్ర‌ధాని మోదీపై ప్ర‌కాశ్‌రాజ్ మ‌రోసారి విమ‌ర్శ‌లు!

  • క‌ర్ణాట‌కకు క‌రవు ప‌రిహారం విష‌య‌మై ప్ర‌కాశ్‌రాజ్ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు 
  • 'ఆయ‌న మ‌హాప్ర‌భువులు.. మ‌హా అబ‌ద్ధాల కోరు' అంటూ మోదీకి చుర‌క‌లు
  • ఈ వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌న్న ప్ర‌కాశ్‌రాజ్‌
న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌ మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. 'ఆయ‌న మ‌హాప్ర‌భువులు.. మ‌హా అబ‌ద్ధాల కోరు' అంటూ మోదీకి చుర‌క‌లు అంటించారు. క‌ర్ణాట‌కకు క‌రవు ప‌రిహారం విష‌య‌మై ఆయ‌న ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క‌రవు ప‌రిహారాన్ని విడుద‌ల చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గ‌కుండా, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నేరుగా అత్యున్న‌త న్యాయ‌స్థానం ముందు వాద‌న‌లు వినిపించ‌డం ఏంట‌ని కేంద్రం అడగడం విడ్డూరమన్నారు.  

'నేను జంగ‌మ‌ను. జంగ‌మ‌ను ప్ర‌జ‌లు అంద‌రూ తాను చెప్పిన‌ట్లు వినాల‌ని' కొంద‌రు నాయ‌కులు అనుకుంటార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌న్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. త‌మ‌కు క‌ర‌వు ప‌రిహారాన్ని విడుద‌ల చేయాల‌ని గ‌తేడాది సెప్టెంబ‌రు నుంచి కోరుతున్నా స్పందించ‌కుండా, ఇప్పుడు క‌ర్ణాట‌క నుంచి విన్న‌ప‌మే రాలేద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.


More Telugu News