విశాఖ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డి.. ఆయనెవరో తెలుసా?

  • సత్యారెడ్డి స్వస్థలం గుంటూరు
  • స్థిరపడింది మాత్రం విశాఖలో
  • గతంలో తెలుగుసేన పార్టీ స్థాపన
  • ఉద్యమ నేపథ్యం కలిగిన 53 సినిమాల నిర్మాణం
  • స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా
ఆంద్రప్రదేశ్‌లో మే 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నిన్న మరికొందరు అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. ఇందులో ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. విశాఖ ఎంపీ స్థానాన్ని పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి)కి కేటాయించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన సినీ నిర్మాత. విశాఖపట్టణంలో స్థిరపడ్డారు.

గతంలో తెలుగుసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు ఆయన ఉద్యమ నేపథ్యం కలిగిన 53 సినిమాలు నిర్మించారు. విశాఖ ఉక్కు నిర్వాసితులతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా నిర్మించారు. అందులో ఆయన స్టీల్‌ప్లాంట్ ఉద్యమనేతగా కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమాలో ప్రజా గాయకుడు, దివంగత గద్దర్ కూడా నటించారు.


More Telugu News