ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి!
- 40 అడుగుల లోతున్న గొయ్యిలో పడిన బస్సు
- ప్రైవేటు సంస్థ ఉద్యోగులను ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదం
- ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఘటన
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గొయ్యిలో పడిపోయింది.
ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. స్థానికంగా ఉండే ఓ డిస్టిలరీ సంస్థలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యోగులతో వస్తున్న బస్సు కుమ్హారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గ్రామం సమీపంలో ప్రమాదం బారిన పడింది. 40 అడుగుల లోతున్న గొయ్యిలో బస్సు పడిపోవడంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది.