తెలంగాణలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం

  • గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
  • రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు
  • రెండు రోజుల క్రితం 44.5 డిగ్రీల వద్ద అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... ఈరోజు 40 డిగ్రీలే అత్యధికం
తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల క్రితం 44.5 డిగ్రీల వద్ద అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... ఈరోజు అత్యధికంగా 40 డిగ్రీలు నమోదయింది. రానున్న ఐదు రోజులు ఉష్ణోగ్రతల ప్రభావం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.


More Telugu News