గాయంతో ఐపీఎల్ కు దూరమైన సన్ రైజర్స్ స్టార్ స్పిన్నర్

  • వేలంలో రూ.1.5 కోట్లకు హసరంగను కొనుగోలు చేసిన సన్ రైజర్స్
  • ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని హసరంగ
  • గాయంతో టోర్నీ మొత్తానికి దూరం
  • హసరంగపిక స్థానంలో యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ ఎంపిక
ఇవాళ పంజాబ్ కింగ్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక అప్ డేట్ వెలువరించింది. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ గాయం కారణంగా టోర్నీకి మొత్తం దూరమయ్యాడని వెల్లడించింది. హసరంగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని సన్ రైజర్స్ టీమ్ మేనేజ్ మెంట్ పేర్కొంది. 

శ్రీలంక జట్టులో మిస్టరీ స్పిన్నర్ గా పేరుగాంచిన హసరంగను గతేడాది జరిగిన వేలంలో సన్ రైజర్స్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ సీజన్ లో హసరంగ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్న హసరంగకు విశ్రాంతినివ్వడమే మంచిదని సన్ రైజర్స్ యాజమాన్యం నిర్ణయించింది. 

హసరంగ స్థానంలో శ్రీలంకకే చెందిన యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ ను జట్టులోకి తీసుకున్నట్టు సన్ రైజర్స్ యాజమాన్యం నేడు ఓ ప్రకటనలో తెలిపింది.


More Telugu News