యాదగిరిగుట్ట ఆలయంలోకి ఫోన్లు తీసుకురావద్దు.. భద్రతా సిబ్బందికీ వర్తింపు

  • భక్తులకు ఇప్పటికే అమలవుతున్న రూల్
  • ఇకపై భద్రతా సిబ్బందికీ వర్తింపజేయనున్నట్లు వెల్లడి
  • ప్రధాన ఆలయంలోకి వెళ్లే సిబ్బందికి ఈవో ఉత్తర్వులు
యాదగిరి గుట్ట ఆలయంలో సెల్ ఫోన్ బ్యాన్ విధిస్తూ ఆలయ ఈవో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు ఈ రూల్ ఇప్పటికే అమలవుతుండగా.. ప్రస్తుతం ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా ఈ రూల్ ను వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే సిబ్బంది ఎవరైనా సరే తమ ఫోన్లను బయటే పెట్టాలని స్పష్టం చేశారు.

ప్రధాన ఆలయంలోకి ఎవరూ ఫోన్లతో రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ భద్రతా సిబ్బందికి ఈవో ఆదేశాలు జారీ చేశారు. మినిస్టీరియల్ సిబ్బంది, నాలుగవ తరగతి, ఎస్.పి.ఎఫ్, హోంగార్డ్స్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు విలేకరులు కూడా ఫోన్లు బయట భద్రపరుచుకోవాలని సూచించారు. సోమవారం జరిగిన శాఖాధిపతుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


More Telugu News